ఈ రాశి వారికి భూలాభాలు.. యత్నకార్యసిద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 24-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి భూలాభాలు.. యత్నకార్యసిద్ధి

May 24 2026 2:03 AM | Updated on May 24 2026 2:03 AM

Rasi Phalalu: Daily Horoscope On 24-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.అష్టమి ఉ.9.06 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మఖ  ఉ.6.50 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.2.46 నుండి 4.21 వరకు, దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.30 వరకు, అమృత ఘడియలు: రా.12.20 నుండి 1.55 వరకు.

సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.23
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...  రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఎంత శ్రమ పడినా ఫలితం ఉండదు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం....  ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం....  వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పాతబాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కర్కాటకం.....  కొన్ని వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహం....  కొత్త పనులు చేపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆహ్వానాలు రాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు.

కన్య....  పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

తుల.....  యత్నకార్యసిద్ధి. నూతన వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. భూలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.

వృశ్చికం....  ఆర్థికాభివృద్ధి. ముఖ్య విషయాలు తెలుస్తాయి. ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

ధనుస్సు....  మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం...  వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఒత్తిడులు తప్పవు.

కుంభం....  కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య విషయాలలో చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం...  వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
 

Advertisement
 
Advertisement
Advertisement