ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 18-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Aug 18 2026 3:01 AM | Updated on Aug 18 2026 3:01 AM

Rasi Phalalu: Daily Horoscope On 18-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం, తిథి: శు.షష్ఠి రా.7.27 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: చిత్త ఉ.7.43 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ప.1.39 నుండి 3.21 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.07 వరకు తదుపరి రా.10.54 నుండి 11.40 వరకు,అమృత ఘడియలు: రా.11.50 నుండి 1.35 వరకు.

సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.22
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం.... బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి స్నేహాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలత. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం.... వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం.... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. బంధువుల నుంచి కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.

కర్కాటకం.... ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

సింహం... రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్య వ్యవహారాలలో పురోగతి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

కన్య.... పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు, సమస్యలు.

తుల.... మిత్రులు,శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఏ పని చేపట్టినా విజయమే. వస్తులాభాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.

వృశ్చికం.... పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త ఇబ్బందిగా మారవచ్చు.

ధనుస్సు... శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనులు సజావుగా పూర్తి. సంఘంలో ఆదరణ. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం... శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కుంభం... ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో నిదానం అవసరం. స్వల్ప అనారోగ్య సూచనలు. ధనవ్యయం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మీనం... వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement