గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.ఏకాదశి ఉ.9.05 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.44 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.6.31 నుండి 8.05 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: ప.3.58 నుండి 5.34 వరకు.
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం...కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. దైవదర్శనాలు.
వృషభం....ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాలు.
మిథునం...కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు రాగలవు.
కర్కాటకం...కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం.
సింహం...వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఉద్యోగులకు చికాకులు.
కన్య.....చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు.
తుల....కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి అవకాశాలు.
వృశ్చికం.......శ్రమాధిక్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఆధ్యాత్మిక చింతన.
ధనుస్సు....వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగమార్పులు.
మకరం...కొన్ని బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.
కుంభం...పనులలో జాప్యం. నిర్ణయాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం.
మీనం...దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. భూములు, వాహనాలు కొంటారు.


