ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు. | Rasi Phalalu: Daily Horoscope On 11-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు.

Apr 11 2026 12:03 AM | Updated on Apr 11 2026 12:04 AM

Rasi Phalalu: Daily Horoscope On 11-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి రా.8.42 వరకు తదుపరి దశమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.10.20 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.2.34 నుండి 4.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.50 నుండి 7.28 వరకు, అమృత ఘడియలు: రా.12.45 నుండి 2.27 వరకు.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం     :  6.10
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల వృద్ధి. ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం: అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కర్కాటకం: మిత్రులతో మరింత సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.

ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.

కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement