ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 10-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

May 10 2026 2:01 AM | Updated on May 10 2026 12:23 PM

Rasi Phalalu: Daily Horoscope On 10-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.అష్టమి ఉ.10.07 వరకు తదుపరి నవమి, నక్షత్రం: ధనిష్ఠ రా.8.17 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం: రా.3.40 నుండి 5.20 వరకు, దుర్ముహూర్తం: సా.4.35 నుండి 5.27 వరకు, అమృత ఘడియలు: ఉ.9.24 నుండి 11.04 వరకు.

సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...  దూరపు బంధువుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. పనులు చకచకా సాగుతాయి. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

వృషభం....  వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం.....  పనులు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం....  నిరుద్యోగులకు అనుకూల సమాచారం. సమస్యలు కొన్ని పరిష్కారం. వస్తులాభాలు. పనులలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతి.

సింహం....  శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి పెరుగుతుంది. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య....  కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల.....  అనుకున్న కార్యాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం.... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు....  శ్రమ పడ్డా ఫలితం ఉండదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం.....  కుటుంబసౌఖ్యం. నూతన ఉద్యోగప్రాప్తి.. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం..  మిత్రులు, బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు కలిసిరావు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం...  శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం.  వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో భారం తగ్గుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement