ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 07-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి

May 7 2026 3:58 AM | Updated on May 7 2026 3:58 AM

Rasi Phalalu: Daily Horoscope On 07-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి ఉ.6.46 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పూర్వాషాఢ ప.3.36 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.12.16 నుండి 2.00 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.44 వరకు, అమృత ఘడియలు: ఉ.10.21 నుండి 12.05 వరకు.

సూర్యోదయం : 5.35
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం....  కుటుంబంలో సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం....  చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

మిథునం....  పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

కర్కాటకం.....  శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనులలో పురోగతి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.

సింహం.....  పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య....  శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల....  రుణాలు తీరుస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు.

వ్చశ్చికం....  రాబడికి మించిన ఖర్చులు. బంధుమిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పనులు కొన్ని విరమిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

ధనుస్సు...  ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మకరం....  సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

కుంభం....  పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

మీనం.....  ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ధనలబ్ధి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు ఫలిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement