ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు | Rasi Phalalu: Daily Horoscope On 05-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు

Apr 5 2026 3:01 AM | Updated on Apr 5 2026 12:47 PM

Rasi Phalalu: Daily Horoscope On 05-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.తదియ ఉ.10.06 వరకు తదుపరి చవితి, నక్షత్రం: విశాఖ రా.10.29 వరకు తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.2.54 నుండి 4.40 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.20 వరకు, అమృత ఘడియలు: ప.12.50 నుండి 2.35 వరకు, సంకటహర చతుర్థి.

సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...  కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం... పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మిథునం.... దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం.... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

సింహం.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. విద్యార్థులకు శుభవార్తలు.

కన్య..... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

తుల...... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహార విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం..... కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా చికాకులు.

ధనుస్సు..... పలుకుబడి పెరుగుతుంది. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం.... చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కుంభం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు.

మీనం... రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement