ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..వ్యాపారాలు లాభిస్తాయి | Today Telugu Horoscope On October 4th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..వ్యాపారాలు లాభిస్తాయి

Oct 4 2025 5:11 AM | Updated on Oct 4 2025 10:10 AM

Rasi Phalalu: Daily Horoscope On 04-10-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.ద్వాదశి ప.1.58 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: ధనిష్ఠ ఉ.7.01 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం: ప.2.08 నుండి 3.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.48 నుండి 7.29 వరకు, అమృత ఘడియలు: రా.11.40 నుండి 1.15 వరకు.

సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం : 5.47
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

వృషభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత. వాహనయోగం.

మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మరింత పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

సింహం: కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కళాకారులకు సన్మానాలు.

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

తుల: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో నిరుత్సాహమే. కళాకారులకు అంచనాలు తప్పుతాయి.

వృశ్చికం: దూరప్రయాణాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో కొత్త సమస్యలు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యభంగం.

కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.

మీనం: పనులలో అవరోధాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు.

Advertisement
 
Advertisement
Advertisement