ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం | Rasi Phalalu: Daily Horoscope On 03-04-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పనుల్లో విజయం

Apr 3 2026 3:55 AM | Updated on Apr 3 2026 10:19 AM

Rasi Phalalu: Daily Horoscope On 03-04-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పాడ్యమి ఉ.7.20 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: చిత్త సా.6.18 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: రా.12.21 నుండి 2.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.11 వరకు తదుపరి ప.12.26 నుండి 1.17 వరకు, అమృత ఘడియలు: ప.11.30 నుండి 1.12 వరకు.

సూర్యోదయం : 5.58
సూర్యాస్తమయం : 6.09
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం...  ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలం.

వృషభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ప్రముఖుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.

మిథునం.... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.

కర్కాటకం... పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా  ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం.... పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కన్య.... మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

తుల.... పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం.... వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దూరప్రయాణాలు.

ధనుస్సు.... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

మకరం.... పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం... పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.

మీనం.... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. మిత్రులతో మాటపట్టింపులు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. దైవదర్శనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement