ఈ రాశి వారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు.. | Horoscope Today: Rasi Phalalu On 15-06-2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు..

Jun 15 2024 6:19 AM | Updated on Jun 15 2024 10:21 AM

Horoscope Today: Rasi Phalalu On 15-06-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.నవమి రా.12.52 వరకు, తదుపరి దశమి
నక్షత్రం: ఉత్తర ఉ.7.33 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: సా.4.51 నుండి 6.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు అమృతఘడియలు: రా.3.31 నుండి 5.18 వరకు. 

మేషం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృషభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు.

మి«థునం: రుణాలు చేస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆస్తుల వ్యవహారాలలో మరిన్ని చికాకులు. మానసిక అశాంతి.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి.

సింహం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం. చిన్ననాటి మిత్రుల కలయిక.

తుల: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనాలు విషయంలో జాగ్రత్తలు పాటించండి.

వృశ్చికం: ఆర్థికాభివృద్ధి. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం.

ధనుస్సు: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం.  ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగుల యత్నాలు విఫలం.

కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పనులలో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.  భూవివాదాలు.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటాబయటా అనుకూలం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement