
కార్యసిద్ధి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,, తిథి: శు.షష్ఠి ప.3.26 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రేవతి రా.12.40 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: ప.12.54 నుండి 2.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.53 నుండి 9.35 వరకు, తదుపరి ప.12.34 నుండి 1.21 వరకు, అమృతఘడియలు: రా.10.28 నుండి 11.32 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.48
మేషం: ఆలోచనలపై స్థిరం ఉండదు. ఏకాగ్రత లేక పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
వృషభం: ఆర్థికాభివృద్ధి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీ మాటకు ఎదురుండదు.
మిథునం: కార్యసిద్ధి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.
కర్కాటకం: ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ఏ పని చేపట్టినా ఆటంకాలే. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు.
సింహం: దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో మరింత చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.
కన్య: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ధనప్రాప్తి. చిన్ననాటి మిత్రులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో సాధారణంగా ఉంటుంది.
తుల: నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. దైవదర్శనాలు. ధన, వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: ముఖ్యమైన పనులు కొంత కష్టసాధ్యం కావచ్చు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు కలసిరావు.
మకరం: ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపార , ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.