గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: శు.విదియ రా.2.29 వరకు, తదుపరి తదియ,నక్షత్రం: శ్రవణం ప.1.29 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: సా.5.15 నుండి 7.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.53 నుండి 9.35 వరకు తదుపరి రా.10.54 నుండి 11.44 వరకు, అమృత ఘడియలు: రా.3.27 నుండి 5.04 వరకు.
సూర్యోదయం : 6.39
సూర్యాస్తమయం : 5.44
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం..... ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. స్థిరాస్తి వృద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.
వృషభం... కొత్తగా అప్పులు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. మానసిక ఆందోళన. దేవాలయదర్శనాలు.
మిథునం..... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి సహాయం. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. దేవాలయదర్శనాలు.
సింహం..... దూరపు బంధువులను కలుసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కన్య... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్యసమస్యలు.
తుల.... ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఖర్చులు తప్పవు.
వృశ్చికం.. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. దేవాలయదర్శనాలు.
ధనుస్సు.... అప్పులు చేస్తారు. అవసరాలకు డబ్బు అందక ఇబ్బంది. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దేవాలయదర్శనాలు.
మకరం...... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు.
కుంభం.... ప్రయత్నాలలో ఆటంకాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. బందువర్గంతో తగాదాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం.. ఆదాయం పెరుగుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యాపార వృద్ధి.


