గ్రహం అనుగ్రహం(16-08-2020) | Daily Horoscope In Telugu 16-07-2020 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(16-08-2020)

Aug 16 2020 6:32 AM | Updated on Aug 16 2020 6:38 AM

Daily Horoscope In Telugu 16-07-2020 - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి బ.ద్వాదశి ఉ.11.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం పునర్వసు తె.5.40 వరకు(తెల్లవారితే సోమవారం) తదుపరి పుష్యమి వర్జ్యం సా.5.28 నుంచి 7.06 వరకు దుర్ముహూర్తం సా.4.41 నుంచి 5.32 వరకు అమృతఘడియలు...లేదు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం 5.46
సూర్యాస్తమయం 6.23

దినఫలాలు..
మేషం..
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన ఉద్యోగయోగం.
వృషభం..
వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం.  స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరాశ. ఆలయాలు సందర్శిస్తారు..
మిథునం..
నూతన వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ధనలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో గందరగోళం నుంచి బయపడతారు.
కర్కాటకం..
రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విరోధాలు. పనులు మ«ధ్యలోనే విరమిస్తారు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో  మరిన్ని బాధ్యతలు చేపడతారు.
సింహం..
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. మిత్రుల కీలక ఆహ్వానం. ఆలయాలు సందర్శిస్తారు.  ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
కన్య..
కొత్త పనులు  చేపడతారు. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల..
కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో తగాదాలు. అనారోగ్య సూచనలు.  వ్యాపారాలలో  నిరాశ. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు.
వృశ్చికం..
ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలలో  సమస్యలు. ఉద్యోగాలలో వివాదాలు. శ్రమాధిక్యం. కళాకారులకు కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు..
ఉద్యోగయత్నాలు కొంత ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బంధువులతో సమస్యలు పరిష్కారం. దైవర్శనాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు.
మకరం..
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి. ఆహ్వానాలు అందుతాయి.   వాహనసౌఖ్యం. వ్యాపారాల విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగాలలో  మరింత అనుకూలం.
కుంభం..
ఆదాయానికి మించి ఖర్చులు. పనులు ముందుకు సాగవు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగులకు పనిభారం.
మీనం..
బంధువుల నుంచి విమర్శలు. కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు.  కొన్ని పనులు  వాయిదా వేస్తారు.  వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. దూరప్రయాణాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement