ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండండి

Daily Horoscope In Telugu 13 May 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, శు.విదియ రా.3.18 వరకు, తదుపరి తదియ నక్షత్రం రోహిణి రా.3.51 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం సా.6.59 నుండి 8.45 వరకు, దుర్ముహూర్తం ఉ.9.46 నుండి 10.37 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకుఅమృతఘడియలు... రా.12.16 నుండి 2.01 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:
మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ధనలబ్ధి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి.

మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు ఒత్తిళ్లు.

కర్కాటకం: కార్యక్రమాలు  విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. శుభవార్తలు వింటారు.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. 

తుల: ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో  అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గుతాయి. ధనలాభ సూచనలు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు.  వ్యాపారాలు,ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

మకరం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.  వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

కుంభం: అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. బంధువులతో వివాదాలు.

మీనం: ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top