పెద్దతిప్పసముద్రం: మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన జుట్టు రవితేజ, చాముండేశ్వరి దంపతుల కుమారుడు జే.సాయితేజ జేఈఈ అడాన్స్‌డ్ పరీక్షల్లో ఎస్సీ కేటగిరీ కింద జాతీయ స్థాయిలో 189వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. యువకుడిని గ్రామస్తులు అభినందించారు.
వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (ఆర్కే వ్యాలీ) క్యాంపస్ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కుమార స్వామి గుప్తా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.విజయ్ ప్రకాష్‌ను నూతన డైరెక్టర్‌గా నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ట్రిపుల్ ఐటీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విభాగాధిపతులతో సమావేశమయ్యారు.
సాక్షి, మదనపల్లె: వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ–ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ విధానాన్ని జూలై ఒకటి నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి టి.త్యాగరాజు తెలిపారు. మార్కెట్ యార్డుల పరిధిలో కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో సంబంధిత వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ–ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ జారీ చేస్తుందని తెలిపారు. ఈ విధానంతో మార్కెట్ ఫీజు ఎగవేత ఉండదని తెలిపారు. ఉత్పత్తుల కొనుగోలు, రవాణా ప్రక్రియపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. వలంటరీ ట్రేడర్లు, రవాణాదారులు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఈ–ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ పొందిన తర్వాత మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ–ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్ వివరాల కోసం రైతులు, వ్యాపారులు మార్కెట్ కమిటీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు.


