మదనపల్లెకు వ్యాపారుల క్యూ | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెకు వ్యాపారుల క్యూ

Jun 3 2026 1:39 AM | Updated on Jun 3 2026 1:39 AM

సాక్షి, మదనపల్లె: మదనపల్లె టమాట నాణ్యతగా ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యాపారులు క్యూ కట్టారు. ఈ రాష్ట్రాలకు అవసరమైన స్థాయిలో టమా ట కొనుగోలు చేసి తరలించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా టమాటా ధర ఆశాజనకంగా పెరిగింది. మార్కెట్‌కి వస్తున్న దిగుబడి తగ్గినప్పటికీ ధరల విషయంలో ప్రభావం చూపడం లేదు. రోజు రోజుకు మదనపల్లె మార్కెట్లో టమాట ధర పెరుగుతూ వస్తోంది. సోమవారం ఏ గ్రేడ్‌ టమోటా అత్యధిక ధర కిలో రూ.33 పలికింది. విక్రయానికి 940 టన్నుల టమాట వచ్చింది. మంగళవారం కూడా కిలో ధర రూ.33 కొనసాగింది. విక్రయానికి 902 టన్నుల టమాటా వచ్చింది. కాగా మంగళవారం మదనపల్లె మార్కెట్‌ నుంచి ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఛత్తీస్గఢ్‌, తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కేరళం, పశ్చిమబెంగాల్‌, ఒరిస్సా రాష్ట్రాలకు, ఏపీలోని అనకాపల్లి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, కాకినాడకు ఎగుమతి అయింది. ఇందులో పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా కు చెందిన వ్యాపారులు నేరుగా ఇక్కడికి వచ్చి వేలంపాటల్లో పాల్గొని టమాటను కొనుగోలు చేశారు. కొన్న టమాటలో పశ్చిమబెంగాల్‌ కు 150 టన్నులు, ఒరిస్సాకు వంద టన్నులు ఎగుమతి చేశారు.

కిలో రూ.33కు పెరిగిన టమాట ధర

ఏడు రాష్ట్రాలకు ఎగుమతి

Advertisement
 
Advertisement
Advertisement