‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లు ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లు ఆవిష్కరణ

Jun 3 2026 1:39 AM | Updated on Jun 3 2026 1:39 AM

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జెడ్పీ ఛైర్మెన్‌ రామగోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ‘బాబూ ష్యూరిటీ, మోసం గ్యారెంటీ’ అనే నినాదాన్ని నిజం చేసి, ఆరు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement