పరిశ్రమల స్థాపనలో యువతకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల స్థాపనలో యువతకు ఉపాధి

Jun 3 2026 1:39 AM | Updated on Jun 3 2026 1:39 AM

పరిశ్రమల స్థాపనలో యువతకు ఉపాధి

సాక్షి, మదనపల్లె: జిల్లాలో పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్టు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్‌ డెస్క్‌ విధానంలో అనుమతులకు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గత 35 రోజుల్లో పరిశ్రమల స్థాపన, విస్తరణ, రెన్యూవల్‌ సంబధిత 27 దరఖాస్తులు అందగా 16కు పరిష్కారం ఇచ్చామన్నారు. పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.3.76 కోట్ల రాయితీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద 74 యూనిట్లకు రూ.2.26 కోట్ల మార్జిన్‌ మనీ విడుదల చేసినట్లు తెలిపారు. పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ కె. కష్ణ కిశోర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వై.వి.కే. సుబ్బారావు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement