● ప్రతిభకు ఉద్యోగాలు ఇవ్వకుంటే
పరీక్షలెందుకు ?
● ఉద్యోగాలను అంగడి సరుకులా
అమ్ముకుంటారా !
● మదనపల్లె కలెక్టరేట్ ఎదుట
హోరెత్తిన యువజన నినాదం
● డీఎస్సీ అక్రమాలపై తీవ్ర ఆగ్రహం
● మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
సాక్షి, మదనపల్లె: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్ ప్రతిభకు పాతరేసి, ఉద్యోగాలను అమ్ముకోవడంపై యువతలో నిరసన పెల్లుబికింది.అక్రమాల డీఎస్సీపై చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులను వంచించిన ప్రభుత్వం తక్షణమే డీఎస్సీను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని నినాదాలతో హోరెత్తించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ పిలుపుతో సోమవారం యువజన విభా గం నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్య క్రమం మదనపల్లెలో విజయవంతమైంది. మెగా డీఎస్సీ నియామకాలు అక్రమాలమయమని.. వాస్తవాలు కళ్లకు కనిపిస్తున్నా ప్రభుత్వం ఇంకా నటిస్తోందని, తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. మీరు నిర్వహించింది ప్రతిభగల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే డీఎస్సీ కాదని, అది ఉద్యోగాలను అమ్మకానికి పెట్టిన దళారు ల సెలక్షన్ కమిటీ అని నినాదాలతో హోరెత్తించింది.
ప్రదర్శన, ధర్నా : వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యరంలో చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమం కోసం వివిధ ప్రాంతాల నుంచి పార్టీ యువజన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మిషన్ కాంపౌండ్ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, స్థానిక సమన్వయకర్త నిసార్ అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్లతో ర్యాలీ ప్రారంభమైంది. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నా రు. అక్కడ పోలీసులు అడ్డుకుని గేట్లు వేశారు. తర్వాత కొద్దిమందిని లోపలికి పంపించారు. తర్వాత గంటకుపైగా కలెక్టరేట్ ఎదుట యువజన విభాగం శ్రేణులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు ధర్నా నిర్వహించా రు. అనంతరం డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ విధుల్లో ఉన్న ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ మాధవకృష్ణారెడ్డికి నేతలు వినతి పత్రం అందజేశారు.పరిశీలకురాలు అనీషారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నేతలు శివప్రసాద్‌రెడ్డి, కిషోర్, కిశోర్‌కుమార్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, దావూద్, కౌషిక్, వాసుదేవరెడ్డి, షేక్ ఇర్ఫాన్, ఖాదర్, హేమంత్, ద్వారకనాధరెడ్డి, పవన్, నాగరాజు రెడ్డి, ఆనంద్, శరత్ రెడ్డి, అశోక్, యూనిస్, ఫిరోజ్, ఆనంద్ రెడ్డి, చక్రధర్, గౌతం, భాస్కర్, బాలాజీ పాల్గొన్నారు.


