మదనపల్లె సిటీ: స్థానిక బీటీ కాలేజీ హాకీ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు జరిగాయి.జిల్లా నలుమూలల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపిక కమిటీలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, సీనియర్ హాకీ క్రీడాకారుడు ఆసిఫ్ సభ్యు లుగా వ్యవహరించారు. తుది జట్టు వచ్చేవారం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారు జూన్ 12 నుంచి 15 వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగే రాష్ట్ర సీనియర్ హాకీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. కార్యక్ర మంలో డీఎస్‌డీఓ చంద్రశేఖర్, హాకీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జలజ, సీనియర్ హాకీ క్రీడాకారుడు హితేష్‌రావు, ఆసీఫ్, పిట్టు, రెడ్డి పాల్గొన్నారు.
సాక్షి, మదనపల్లె: జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురావాలని డిస్కం జిల్లా ఎస్‌ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్ ద్వారా తమ సమ స్యలను తెలియజేయాలని కోరారు. 94408 17449 నంబర్‌కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా ట్రిపుల్ ఏ రేటింగ్ లభించినట్లు ప్రిన్సిపాల్ రామనాథన్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎన్‌పీటీఈఎల్ ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు, అధ్యాపకులు 7484 మంది ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. కళాశాలకు టిపుల్ ఏ రేటింగ్‌తో పాటు టాప్ 20లో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో ఒకటో ర్యాంకు గుర్తింపు లభించినట్లు చెప్పారు. ఎన్‌పీటీఈఎల్ ద్వారా కళాశాలకు విశిష్ట గుర్తింపు లభించడం పట్ల చాన్స్‌లర్ డాక్టర్ నాదెళ్ల విజయ భాస్కర్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు.


