పుంగనూరు : దొంగ అనుకుని ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాదిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం మండలంలోని దిగువపల్లెలో బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగతనం చేస్తున్నాడని రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లెకి చెందిన బాబాసాహెబ్‌ను గ్రామస్తులు వైర్లు, కర్రలతో తీవ్రంగా చితకబాదారు. ఈ దాడిలో బాబాసాహెబ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌ను ఢీకొన్న కారు
మదనపల్లె టౌన్ : బైక్‌పై వెళ్తున్న రైతును ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ములకలచెరువు సీఐ ప్రతాప్ ఆదివారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం గందోడిపల్లికి చెందిన రైతు రెడ్డప్పరెడ్డి(55) అన్నమయ్య జిల్లా పి.కొత్తకోటలో వ్యాపారులు అప్పుగా తీసుకున్న ఎరగ్రడ్డల డబ్బు వసూలు చేసుకుని రావడానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గంమధ్యలోని పులికల్లు మిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు రెడ్డప్పరెడ్డిని ములకలచెరువు 108 సిబ్బంది హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైతు మృతి


