పెద్దమండ్యం : పాముకాటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని దిగువపల్లె పంచాయతీ తుమ్మలవంకతండాలో ఆదివారం జరిగింది. వివరాలలోకి వెళితే.. తుమ్మలవంకతండా సమీపంలో యర్రకోటాల బండ వద్ద జలధార ఫీడర్ ఛానల్ పూడికతీత పనులను తండాకు చెందిన కూలీలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ పనులు చేస్తుండగా మూడే వెంకటరమణ నాయక్ భార్య సుశీలమ్మ(65) పాముకాటుకు గురైంది. దీంతో ఆమె అక్కడే కుప్పకూలడంతో కూలీలు హుటాహుటిన చికిత్సల కోసం తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్ ఆమె అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పాముకాటుతో కూలీ మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఉపాధి కూలీలు అధికారులను కొరారు.
శివాలయంలో
కొండ చిలువ కలకలం
ముద్దనూరు : మండల పరిధి చింతకుంట గ్రామంలోని కొండపై వెలసిన శివాలయంలో ఆదివారం కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండచిలువను చూసిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం గ్రామస్తులే కొండచిలువను కొండలో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
వృద్ధురాలి మృతి


