● ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | - | Sakshi
Sakshi News home page

● ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వాల్మీకిపురం: ఎన్నికల కమిషన్‌ అధికారికంగా నిర్వహిస్తున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అత్యంత అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక షిరిడిసాయి కళ్యాణమండపంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఎల్‌ఏల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడానికి కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని, ఏజెంట్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను, అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు క్యాడర్‌ సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లారి తిమ్మారెడ్డి, ఇక్బాల్‌ అహ్మద్‌, సతీష్‌ రెడ్డి, రత్నశేఖర్‌రెడ్డి, దండు జగన్మోహన్‌ రెడ్డి, చక్రధర్‌, ఉదయ్‌ కుమార్‌, శివానంద రెడ్డి, కేశవ రెడ్డి, వెంకట్రమణ, రాంపల్లి రమేష్‌, కమలాకర్‌ రెడ్డి, ముక్తియార్‌, రమేష్‌ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, జమీర్‌ అలీఖాన్‌, అప్పల్లా, నక్కా చంద్రశేఖర్‌, నీళ్లభాస్కర్‌, శ్రీధర్‌రాయల్‌, ఇబ్రహిం, ఇర్ఫాన్‌, సాధిక్‌, శివారెడ్డి, జయచంద్ర, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement