సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల కింద ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులను ఇప్పుడు టెట్ పాస్ కావాలంటే కష్టతరమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టంలో సవ రణలు చేయాలని డిమాండ్ చేశారు. 2010 కు ముందు సర్వీస్‌లో చేరిన ఉపాధ్యాయులకు, పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
– ఆదిరెడ్డి శ్యామసుందరరెడ్డి,
ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పార్లమెంట్‌లో చట్టం
చేయడమే ఏకై క మార్గం
టెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే పార్లమెంటులో చట్టం చేయడమే ఏకై క మార్గం. రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల లక్ష లాది మంది ఉపాధ్యాయులు గందరగోళంలో పడ్డారు. ఉపాధ్యాయులు ఒకవైపు పాఠ శాలల్లో విద్యా బోధన చేస్తూ, మరోవైపు టెట్ పరీక్షలకు సిద్ధం కావడం ఆచరణలో చాలా కష్టతరం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ జరిగేలా చూడాలి.
–మాదన విజయ కుమార్,
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు.


