ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ మూల విరాట్‌లకు పంచామృతాభిషేకం జరిపారు.టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి మూలవిరాట్‌లను గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.
వేంపల్లె : మండల పరిధి నాగూరు గ్రామంలోని హరిజనవాడకు చెందిన గ్రీన్ అంబాసిడర్ వేమా నాగన్న (55) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు లు తెలిపారు. వేమా నాగన్న విధుల్లో భాగంగా ఈ నెల 27న మూడు చక్రాల రిక్షాపై నాగూరుకు బయలు దేరారు. మార్గం మధ్యలో రిక్షా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకు కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వివరించారు. ఆయనకు భార్య మేరీ సువర్ణ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వైద్య విద్యలో విద్యార్థి ప్రతిభ
కడప సెవెన్‌రోడ్స్ : కడపకు చెందిన వసంత్ మౌని విహంత్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్‌లో ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో ఆయన అఖిల భారతస్థాయిలో 26వ ర్యాంకును సాధించారు. న్యూరో సర్జరీ విభాగంలో ఓపెన్ కేటగిరి కింద ఎయిమ్స్, నిమ్‌హాన్స్, జిప్‌మర్, పీజీ ఐ చండీఘర్‌లలో 31 సీట్లు మాత్రమే ఉండ గా, అందులో ఒకటి ఆయన కై వసం చేసుకున్నా రు. కడపలోని సింగారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న కాంట్రాక్టర్ వెంకట సుబ్బారెడ్డి కుమారుడైన విహంత్‌రెడ్డి పూణెలోని ఆర్మ్‌డ్ ఫోర్స్‌డ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీని పూణెలోని భారతి విద్యాపీ ఠ్ కళాశాలలో పూర్తి చేసి ఇప్పుడు న్యూరో సర్జరీ విభాగంలో సీటు పొందారు.
కడప ఎడ్యుకేషన్: కడప నాగారాజుపేటకు చెందిన దివంగత వేపరాల వీర భాస్కర్ రావు (రిటైడ్ హెడ్ మాస్టర్ సీఎస్‌ఐ స్కూల్) మనవరాలు పెట్లు కావ్య, కుమారుడు వేపరాల గోయల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించారు.విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్తిక దండంగి ఆధ్వరంలో 2026 ఫిబ్రవరి 2న పలు దేశాలకు చెందిన 777 మంది ‘ది లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ ఎంసెంబల్’ చేశారు. 777 మంది గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకొన్నారు. వీరిలో కడప కు చెందిన పెట్లు కావ్య, వేపరాల గోయల్ ఉన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ గౌచ్చిబౌలి విక్టరీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్ అగస్తిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
కావ్య, గోయల్


