రాయచోటి : రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ శాఖ చేపడుతున్న క్లీన్‌స్వీప్ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి ఎస్సీ కాలనీలోని సాయిబాబా వీధిలో నిర్వహిస్తున్న క్లీన్‌స్విప్ కార్యక్రమాన్ని ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కాలువలు,డ్రైనేజీలు శుభ్రపరిచే పనులను తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇంటింటా చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లలోనే చెత్తను వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కలెక్టర్ కోరారు. రోడ్లు, కాలువలు, ఖాళీస్థలాల్లో చెత్త వేయడం పూర్తిగా మానుకోవాలని తెలిపారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మీకులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాయచోటిలో నలభైరోజులుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా 122 కిలోమీటర్ల డ్రైనేజీలలో 95 కిలోమీటర్లమేర పూడికతీత, శుభ్రపరిచే పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


