సాధుకొండలో మైనింగ్‌ను అడ్డుకుంటాం. జగనన్న పాలనలో శైవ భక్తుల మనోభావాలకు పెద్దపీట వేశాం. కొండలను కాపాడటమేకాక ఆలయ అభివృద్ధికి కృషి చేశాం. మైనింగ్ పేరుతో దోచుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు పన్నాగం వేశారు. రహస్యంగా బిడ్లను ఆహ్వనించిన ప్రభుత్వం ఇప్పుడు ఏపీఎండీసీ ద్వారా సర్వే చేయించేందుకు పూనుకోవడం ఏకపక్షమే. తంబళ్లపల్లె ప్రజలు, భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదు. మల్లయ్యకొండల జోలికి వస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు. –పీవీ.మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ
భక్తులు ఊరుకోరు
పవిత్ర శైవ పుణ్యక్షేత్రంగా వర్దిల్లుతున్న మల్లయ్యకొండల సముదాయంలోని సాధుకొండలో మైనింగ్ కోసం సర్వే చేస్తే భక్తులు ఊరుకోరు. 2006 నుంచి మైనింగ్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొండల్లో శివనామస్మరణ తప్ప మరో ధ్వని వినపడకూడన్న కృతనిశ్చయానికి కట్టుబడింది. భక్తుల కోసం ఊహించని స్థాయిలో సౌకర్యాలు కల్పించాం. ఇప్పుడు మైనింగ్ పేరుతో కొల్లగొడతామంటే ప్రజలు, భక్తులు ఒప్పుకోరు. –పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి,
తంబళ్లపల్లె ఎమ్మెల్యే


