గాయపడిన వాణి వెంకటేష్ హైదర్ సాబ్ రమణ
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): నిమ్మనపల్లె మండలంలోని మర్రిబండ వద్ద శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నిమ్మనపల్లె 108 సిబ్బంది జస్వంత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఆటో డ్రైవర్ వెంకటేష్, ప్రయాణీకులు వాణి, హైదర్ సాబ్, రమణతో పాటు మరో వ్యక్తిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లు, చేతులు విరగడంతో వెంకటేష్, హైదర్ సాబ్‌లను మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


