ఆరోగ్య భారతి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య భారతి

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

కమలాపురం : సమాజ సంక్షేమానికి భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) పెద్దపీట వేస్తోంది. పరిశ్రమ నెలకొల్పిన ప్రాంతమైన వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో భారతి సిమెంట్స్‌, అపోలో టెలీమెడిసిన్‌ నెట్‌ వర్కింగ్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆన్‌సైట్‌ వైద్య సంరక్షణను టెలీమెడిసిన్‌ ఆధారిత స్పెషాలిటీ కన్సల్టేషన్‌లతో కలిసి గ్రామీణులకు ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డిజిటల్‌ క్లినిక్‌ రూపొందించింది. ఈ ప్రాజెక్ట్‌ను అపోలో టెలిమెడిసిన్‌ నెట్‌ వర్కింగ్‌ ఫౌండేషన్‌ అమలు చేస్తూ, కార్యచరణ రూపొందించింది. నిరంతర సేవలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పటిష్టమైన డిజిటల్‌ ఆరోగ్య వ్యవస్థ ఉండేలా చర్యలు చేపట్టింది.

ప్రముఖ అపోలో హాస్పిటల్స్‌ పర్యవేక్షణలో 2015లో ఫ్యాక్టరీ ఎదుటే రూ. 50 లక్షల వ్యయంతో టెలీక్లినిక్‌ను ఏర్పాటు చేశారు. అపోలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రోజుకు దాదాపు 40 నుంచి 50 మంది రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల ప్రజలతో పాటు కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల నుంచి నిత్యం అధిక సంఖ్యలో క్లినిక్‌కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. చికిత్స చేయడంతో పాటు మందుల పంపిణీ, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వైద్య సేవలు అందించారు.

అపోలో పర్యవేక్షణలో

డిజిటల్‌ క్లినిక్‌ నిర్వహణ

Advertisement
 
Advertisement
Advertisement