మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు : గ్రామీణ యువతకు క్రీడలు ఎంతో అవసరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో మిథున్ దళం క్రికెట్ టోర్నమెంట్‌ను పెద్దిరెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ జిల్లాయూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో మిథున్‌దళం టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి క్రీడాకారులు, అభిమానులు, గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రికెట్ ఆడి ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి క్రీడలను ప్రోత్సహించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం క్రీడలను విస్మరించిందని ఆరోపించారు. క్రీడాకారులు పెద్దిరెడ్డి జిందాబాద్...మిధున్‌రెడ్డి జిందాబాద్ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాణావత్ మునీంద్రనాయక్, పార్టీ నాయకులు భానుప్రసాద్, రాజేష్, సురేష్, ప్రశాంత్‌రెడ్డి, డాబా శ్రీనివాసులు, ఆంజినాయక్, శ్రీనివాసులునాయక్, వేణునాయక్, మోహన్‌నాయక్, బాబునాయక్, రాజునాయక్, రషీదబేగం తదితరులు పాల్గొన్నారు.


