● తంబళ్లపల్లె: రోడ్డున పడ్డ విభేదాలు.. కారు అద్దాలు ధ్వంసం! | - | Sakshi
Sakshi News home page

● తంబళ్లపల్లె: రోడ్డున పడ్డ విభేదాలు.. కారు అద్దాలు ధ్వంసం!

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

● తంబళ్లపల్లె: రోడ్డున పడ్డ విభేదాలు.. కారు అద్దాలు ధ్వంసం!

తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య శత్రుత్వం పతాక స్థాయికి చేరింది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ములకలచెరువు బస్టాండ్‌ సర్కిల్‌లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ కేక్‌ కట్‌ చేసేందుకు ఆయన వర్గీయులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో నకిలీ మద్యం కేసులో ఇరుక్కున్న జయచంద్రారెడ్డి వర్గానికి చెందిన రమేష్‌ అనే నాయకుడు తన కారులో అక్కడికి చేరుకుని మొబైల్‌లో వీడియో తీయడం మొదలుపెట్టాడు. దీనిని శంకర్‌ యాదవ్‌ వర్గీయులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన శంకర్‌ వర్గీయులు రమేష్‌ కారు అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేశారు. బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్‌ఛార్జ్‌ లేని ఈ నియోజకవర్గంలో మహానాడు ‘ఎవరికి వారే యమునా తీరం’లా సాగింది.

Advertisement
 
Advertisement
Advertisement