డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలి రావాలని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిశోర్ దాస్ పిలుపునిచ్చారు. మదనపల్లెలోని అంబేడ్కర్ సర్కిల్‌లో ఉదయం 9.30గంటలకు ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. పార్టీలు, వర్గాలకతీతంగా తరలి వచ్చి మద్దతు తెలియజేయాలని కోరారు. – జంగంరెడ్డి కిశోర్ దాస్, వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం
జిల్లా అధ్యక్షుడు, అన్నమయ్య


