● అక్రమ కమీషన్‌ సొమ్మును తిరిగి ఇప్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

● అక్రమ కమీషన్‌ సొమ్మును తిరిగి ఇప్పిస్తాం

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

● అక్రమ కమీషన్‌ సొమ్మును తిరిగి ఇప్పిస్తాం

సాక్షి, మదనపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో దళారీలు, మండీ యజమానుల దందా మళ్లీ పడగ విప్పింది. చంద్రబాబు సర్కార్‌ సంక్షేమాన్ని కేవలం మాటలకే పరిమితం చేసి, క్షేత్రస్థాయిలో అన్నదాతల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో రైతులను దళారుల దోపిడీ నుంచి రక్షించేందుకు తీసుకొచ్చిన చరిత్రాత్మక ఉత్తర్వులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. మార్కెట్‌ యార్డుల్లో మండి యజమానులు రైతులను నిలువునా దోచుకునేందుకు సర్కార్‌ పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో 10 శాతం కమీషన్‌ పేరిట రైతుల నుంచి రోజుకు రూ.కోట్ల సొమ్ము దోచుకుంటున్నా మార్కెటింగ్‌ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

రూ.వందల కోట్ల వ్యాపారం..

దళారుల పాలు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా రైతులు టమాటా పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, పుంగనూరు మార్కెట్‌ యార్డులకు ప్రతి నెలా వేల టన్నుల టమాటా విక్రయానికి వస్తుంది. సీజన్‌ సమయంలో టమాటా విలువ ఒక్కరోజుకే రూ.కోట్లలో ఉంటుంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. మార్కెట్‌ యార్డుల్లో రైతులు అమ్మే పంట ఉత్పత్తుల ధర నుంచి ఎలాంటి కమీషన్‌ వసూలు చేయకూడదు. పంటను కొనుగోలు చేసే వ్యాపారుల (బయ్యర్స్‌) నుంచే యూజర్‌ చార్జీల కింద 1 శాతం వసూలు చేయాలి. దీనివల్ల రైతుపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. కానీ అమలు చేయాల్సిన మార్కెటింగ్‌ శాఖ పట్టించుకోకపోవడంతో ఈ దందా జిల్లా అంతటా యథేచ్ఛగా సాగుతోంది.

ములకలచెరువులో రైతుల

ఆందోళనతో బట్టబయలు

టమాటా రైతుల నుంచి జరుగుతున్న 10 శాతం కమీషన్‌ వసూళ్ల వ్యవహారం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా, మంగళవారం ములకలచెరువు మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు ఉప్పెనలా నిరసనకు దిగడంతో ఈ దోపిడీ అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

అధికారి సంచలన నిజం: °Æý‡-çܯ]l çÜ…§ýl-Æý‡Â…V> OÆð‡™èl$ ¯éĶæ$-MýS$yýl$ ç³§ýlÃ-¯é¿ýæÆð‡yìlz.. "rÐ]l*-sê OÆð‡™èl$ÌS ¯]l$…_ AçÜË$ MýSÒ$-çÙ-¯Œl G…™èl Ð]lçÜ*Ë$ ^ólĶæ*-Í?" A° Ð]l*Æð‡PsŒæ M>Æý‡Å-§ýlÇØ ¯]lÒ¯Œl MýS$Ð]l*ÆŠæ Æð‡yìlz° °ÌS-©-Ô>Æý‡$. ©°MìS çÜÐ]l*-«§é¯]l…V> M>Æý‡Å§ýlÇØ çܵ…¨-çÜ*¢.. Æ>çÙ‰-ÐéÅç³¢…V> A°²^øsêÏ 10 Ô>™èl… MýSÒ$-çÙ-¯Œl Ð]lçÜ*Ë$ ^ólçÜ$¢¯]l² Ð]l*r ÐéçÜ¢-Ð]lÐól$¯]l° OÆð‡™èl$ÌS Ýë„ìSV> A…X-MýS-Ç…-^éÆý‡$. ©…™ø Ð]l¬ÌSMýS-ÌS-^ðl-Æý‡$Ð]l# Ð]l*Æð‡PsZϯ]l* D §øí³yîl Ķæ$£ól-^èleV> ÝëVýS$-™èl$¯]l²r$Ï çܵçÙt-OÐðl$…-¨.-⚠️

ఏడీ త్యాగరాజురైతుల నిరసన తీవ్రరూపం దాల్చడంతో మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ త్యాగరాజు రంగంలోకి దిగి సర్దుబాటు చర్యలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ..‘టమాటా మండి యజమానులు జిల్లాలో ఏ మార్కెట్లోనూ కమీషన్‌ వసూలు చేయరాదు. అలా వసూలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కొత్త రైతు చట్టాల నిబంధనల మేరకు రైతుల నుంచి కమీషన్‌ వసూలు చేయడం పూర్తిగా తప్పు. ఇప్పటికే రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన కమీషన్‌ను తిరిగి వసూలు చేసి రైతులకు ఇప్పిస్తాం. దీనికోసం మండి యజమానులు ఇచ్చిన రసీదులను రైతులు మాకు అందజేయాలి. ఆ రసీదుల ఆధారంగా ఏ మండీ కమీషన్‌ వసూలు చేసిందో గుర్తించి, వారి నుంచి ఆ మొత్తాన్ని తిరిగి రైతులకు ఇప్పిస్తాం‘ అని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని చెప్పుకునే చంద్రబాబు సర్కార్‌ ఇప్పటికై నా కనువిప్పి, గత ప్రభుత్వం అమలు చేసిన రైతు అనుకూల ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని, కేవలం రసీదులు అడగడం వంటి సాకులు చెప్పకుండా క్షేత్రస్థాయిలో దళారుల దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కూటమి సర్కార్‌ ‘గ్రీన్‌ సిగ్నల్‌’

జగనన్న తెచ్చిన 1% ‘యూజర్‌ చార్జ్‌’ నిబంధనను తుంగలో తొక్కినచంద్రబాబు ప్రభుత్వం!

మార్కెట్‌ యార్డుల్లో బహిరంగంగా దళారీల రాజ్యం!

మదనపల్లె, ములకలచెరువు, పుంగనూరు, గుర్రంకొండల్లో నిలువు దోపిడీ!

రోజువారీ కోట్లాది రూపాయలటర్నోవర్‌పై 10 శాతం కమీషన్ల వేటు!

రాష్ట్రవ్యాప్తంగా దోపిడీ నిజమేనని రైతుల సాక్షిగా ఒప్పేసుకున్న మార్కెట్‌ సెక్రటరీ!

కార్యాలయాల ముట్టడితోదిగొచ్చిన ఏడీ త్యాగరాజు

‘కమీషన్‌ సొమ్ము వెనక్కి ఇప్పిస్తాం!’అంటూ హామీ

Advertisement
 
Advertisement
Advertisement