బక్రీద్‌ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ శుభాకాంక్షలు

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

బక్రీద్‌ శుభాకాంక్షలు త్యాగానికి ప్రతీక బక్రీద్‌ బ్యాంకు ఖాతాలు తెరవాలి జలధార పనుల్లో వేగం పెంచాలి రైతులందరికీ ఆమోదయోగ్యంగా పరిహారం

పుంగనూరు: బక్రీద్‌ను పురస్కరించుకుని ముస్లింలకు రాష్ట్ర మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వారు విడివిడిగా మాట్లాడుతూ ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఐకమత్యానికి, క్రమశిక్షణకు ముస్లింలు ప్రతీకగా నిలుస్తారని కొనియాడారు.

రాయచోటి అర్బన్‌: త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్‌ నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బక్రీద్‌ పండుగను భక్తిశ్రద్దలతో , శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మత సామర్యం వెల్లివిరియాలన్నారు. ఈ సంధర్భంగా ముస్లిం సోదరులకు శ్రీకాంత్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

మదనపపల్లె సిటీ: తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు తెరవాలని జిల్లా సాంఽఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్‌రెడ్డి తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలుకు జూన్‌ నెలలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అర్హత కలిగిన షెడ్యూలు కులాల విద్యార్థులు తప్పనిసరిగా విద్యార్థి పేరు మీద నూతన బ్యాంకు ఖాతా లేదా పోస్టల్‌ బ్యాంకు ఖాతా తెరవాలన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈనెల 31వతేదీలోపు బ్యాంకు ఖాతా, ఎన్‌పీసీఐ లింకింగ్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

మదనపల్లె టౌన్‌: జలధార పనుల్లో వేగం పెంచాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) శివ్‌ నారాయణ శర్మ పేర్కొన్నారు. నిమ్మనపల్లె మండలం, రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీలో చేపడుతున్న జలధార పనులను బుధవారం ఎంపీడీవో, తహసీల్దార్‌ తపశ్వణి, ఏపీఓ, ఇరిగేషన్‌ ఏఈ,ఫీల్డ్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పనులను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేసి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం నిమ్మనపల్లిలోని బహుదా డ్యాంను జాయింట్‌ కలెక్టర్‌ సందర్శించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వనరుల సంరక్షణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఫీల్డ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మదనపల్లె టౌన్‌: జాతీయ రహదారి–71 నిర్మాణానికి భూములు కోల్పోయిన బాధిత రైతులందరికీ ఆమోద యోగ్యమైన పరిహారం అందజేస్తామని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చెల్లా కళ్యాణి హామీ ఇచ్చారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎనన్‌హెచ్‌ అధికారులు, బీకేపల్లి, బసినికొండ, వెంకప్పకోట గ్రామాల రైతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, భూసేకరణలో నష్టపోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. నష్టపరిహారం త్వరితగతిన అందేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

రామచంద్రారెడ్డి

ఎంపీ

పీవీ మిధున్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement