మదనపల్లెకు టమాటా వరద | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెకు టమాటా వరద

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

మదనపల్లెకు టమాటా వరద సీపీఎల్‌–2 ఫైనల్లో పాయ్‌ వైస్రాయ్‌ జట్టు

విక్రయానికి 1,080 టన్నులు

సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్‌ యార్డ్‌కు టమాటా వరదలా వచ్చి పడుతోంది. పది రోజులుగా కొద్దిగా పెరుగుతూ వచ్చిన దిగుబడి బుధవారం భారీగా వచ్చింది. ఏకంగా 1,080 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. గతంతో పోలిస్తే అత్యధిక ఏ గ్రేడ్‌ రకం ధర కిలో రూ.26 పలికింది. అంటే గత రెండు రోజులు కిలో 30 పలికింది. దిగుబడి పెరగడంతో కిలో రూ.4 తగ్గింది. సోమవారం ఏ గ్రేడ్‌ అత్యధిక ధర కిలో రూ.30 పలకగా 873 టన్నుల టమాట వచ్చింది. మంగళవారం ఏ గ్రేడ్‌ అత్యధిక ధర కిలో రూ.30 పలికితే విక్రయానికి 895 టన్నులు వచ్చింది. బుధవారం దీనికి మించి వచ్చింది. ఈ టమాట దిగుబడి ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడామైదానంలో జరుగుతున్న సీపీఎల్‌ సీజన్‌ 2లో పాయ్‌ వైస్రాయ్‌ జట్టు ఫైనల్‌కు చేరింది.బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆదిత్య బిఆర్‌ జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన పాయ్‌ వైస్రాయ్‌ జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ జట్టులో జహీర్‌ అబ్బాస్‌ 28 బంతుల్లో 54 పరుగు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన దిత్య బిఆర్‌ జట్లు 147 పరుగులకే ఆలౌలైంది. జహీర్‌ అబ్బాస్‌కు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌, సెక్రటరీ సతీష్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement