కొత్తిమీర మూట దించుతూ తెగిపోయిన చెవి | - | Sakshi
Sakshi News home page

కొత్తిమీర మూట దించుతూ తెగిపోయిన చెవి

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

రామసముద్రం : కొత్తిమీర మూట దించుతూ ప్రమాదవశాత్తు చెవి కమ్మకు తగలడంతో చెవి తెగిన సంఘటన బుధవారం రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చింతామణికు చెందిన మంజుల(40) రామసముద్రం మండలం నారిగానిపల్లి వద్ద కొత్తిమీర కోసేందుకు కూలీలతో పాటు వచ్చింది. అయితే కోసిన కొత్తిమీర మూటలను వాహనానికి లోడు చేస్తుండగా ప్రమాదవశాత్తు మూట చెవి కమ్మపై జారడంతో కమ్మతో సహా చెవి తెగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. గమనించిన కూలీలు ఆమెను హుటాహుటిన చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యాధికారి నాగరాజు ఆధ్వర్యంలో స్టాఫ్‌ నర్స్‌ శిల్ప కుట్లు వేసి చికిత్స చేశారు. సిబ్బంది రమణ, నాగేంద్ర పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement