భూకబ్జాదారుల నుండి మా భూములు కాపాడండి | - | Sakshi
Sakshi News home page

భూకబ్జాదారుల నుండి మా భూములు కాపాడండి

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

మదనపల్లె టౌన్‌ : వంశపారంపర్యంగా వచ్చిన తమ వ్యవసాయ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎరజ్రేనువారిపల్లి గ్రామ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మదనపల్లె ప్రెస్‌ క్లబ్‌లో బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. కురబలకోట మండలం, సంధిరెడ్డిగారిపల్లి పంచాయతీ ఎరజ్రేనువారిపల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్లు 605–1, 595, 677 పరిధిలోని సాగు భూములను తాము దాదాపు 100సంవత్సరాలకు పైగా వారసత్వంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. 2023 నుంచి కొందరు వ్యక్తులు కలిసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ముదివేడు పోలీస్‌ స్టేషన్‌న్‌ లో కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భూములకు రక్షణ కల్పించాలని బాలకృష్ణారెడ్డి, రెడ్డప్ప రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, సావిత్రి విజ్ఞప్తి చేశారు.

ఎరజ్రేనువారిపల్లి రైతుల వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement