పిడుగు పాటుకు ఉపాధి కూలీకి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పిడుగు పాటుకు ఉపాధి కూలీకి గాయాలు

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

సంబేపల్లె : మండల పరిధిలోని అడవికమ్మపల్లె గ్రామం బండకాడ హరిజనవాడకు చెందిన ఆంజనేయులు పిడుగుపాటుకు గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఆంజనేయులు గ్రామ సమీపంలోని పొలాల్లో జరుగుతున్న ఉపాధి పనికి వెళ్లాడు . ఈ క్రమంలోనే బుధవారం ఉరుములతో కూడిన వర్షం పడటంతో ఒక్కసారిగా పెద్దశబ్దం రావడంతో పిడుగు పడి పెద్దశబ్దం వచ్చినట్లు తోటి కూలీలు తెలిపారు. అప్పటికే ఆంజనేయులకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరామర్శించిన ఉపాధి అధికారులు : పిడుగుపాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులను ఉపాధి ఏపీడీ మధుబాబు, ఎంపీడీఓ సురేష్‌, ఏపీఓ రెడ్డిజవహర్‌లు పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement