మదనపల్లె టౌన్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న దళిత మహిళపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన బుధవారం కురబలకోట మండలం ముదివేడులో వెలుగు చూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. ముదివేడుకు చెందిన బి. రాజమ్మ (50) తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకూడదని అదే వీధిలో నివసించే ఆఫ్సల్, హసీనా, షాహిన తదితరులు ఆమెను అడ్డుకున్నారు. పూర్వీకుల నుంచి వాడుకలో ఉన్న దారిలో పోకుండా మరే దారిలో వెళ్లాలని రాజమ్మ ప్రశ్నించడంతో ఆగ్రహించిన పలువురు ఆమైపె మూకుమ్మడిగా దాడి చేసి అసభ్యకరంగా దూషించారని ఆరోపించింది. దాడిలో గాయపడిన రాజమ్మను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


