పులిచెర్ల (కల్లూరు) : కల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.... కల్లూరు –పీలేరు జాతీయ రహదారిలో పెట్రోల్ బంకువద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాతపేట పంచాయతీ శాంతి నగర్‌కు చెందిన లక్మ్యయ్య(50 )స్వగ్రామం నుంచి పీలేరుకు ద్విచక్రవాహనంలో వెళుతుండగా పీలేరు నుంచి ఎదురుగా వస్తున్న ఈచర్ లారీ వాహనం ఢీకొనడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకొన్న కల్లూరు పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యువతి అదృశ్యం
రొంపిచెర్ల : రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామ పంచాయతీలో యువతి అదృశ్యమైనట్లు మహిళ తల్లి భాగ్యలక్ష్మీ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం చండ్రామాకులపల్లె గ్రామ పంచాయతీ బంటిమిట్టకు చెందిన బెంగళూరు భాగ్యలక్ష్మీ తన కుమారై జోష్న (19)ను కె.వి.పల్లె మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పెద్ద కమ్మపల్లెకు చెందిన ఆంజినేయులుకు ఇచ్చి వివాహం చేశామని తెలిపారు. వీరు రెండు నెలల క్రితం రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో భూమి లీజుకు తీసుకుని టమాట పంట సాగు చేశారని తెలిపారు. అయితే ఈ నెల 21వ తేది తన కూతురు పక్కింటి వారితో మాట్లాడి వస్తానని భర్త ఆంజనేయులకు చెప్పి వెళ్లిందని తెలిపారు. అయితే ఎంత సేపటికీ ఇంటికి రాక పోవడంతో గ్రామంలో గాలించామని తెలిపారు. అయితే కొందరు ఆర్టీసీ బస్సులో పీలేరుకు వెళ్లిందని తెలిపారన్నారు. బంధువుల ఇళ్లు గాలించామని ఎక్కడా ఆచూకీ లేదన్నారు. తన కుమార్తె పెళ్లికాక ముందు చండ్రా మాకులపల్లెకు చెందిన సద్దాంబాషా అనే వ్యక్తితో చనువుగా ఉండేదని తెలిపారు. అతని మీద అనుమానం ఉందని రొంపిచెర్ల పోలీసులకు తల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్ బుధవారం తెలిపారు.
ఇనుప వస్తువులు
దొంగలించిన వ్యక్తి అరెస్ట్
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామ సమీపంలో ఉన్న మెగా ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలోని స్టోర్‌లో ఉన్న ఇనుప వస్తువులను దొంగిలించిన అరూప్ కూమర్ బెర అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మెగా ఇంజినీరింగ్ కంపెనీలో స్టోర్ ఇన్‌ఛార్జిగా అరూప్ కుమార్ బెర పని చేస్తున్నారన్నారు. స్టోర్‌లో ఉన్న సుమారు రూ. 3.09 లక్షలు విలువైన 13 టన్నుల ఇనుప ప్లేట్లను దొంగిలించారన్నారు. కంపెనీ హెచ్‌ఆర్ వినోద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేంపల్లి రోడ్డులోని పెద్దనపాడు సాయిబాబు ఆలయం వద్ద నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు.
బీహార్ వాసి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండులో గంజాయి కలిగి ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన గంగూలి కుమార్‌ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్టీసీ బస్టాండు ఆవరణంలో బుధవారం బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన గంగూలి కుమార్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో టూ టౌన్ సీఐ వంశీనాథ్ అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా సుమారు 200 గ్రాముల ఎండు గంజాయి దొరికింది.


