ఘాట్‌ రోడ్డులో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డులో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులోని అయిదవ మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడిన విషయం తెలిసిందే. అయితే ఆ గ్యాస్‌ ట్యాంకర్‌ నుంచి బుధవారం ఎట్టకేలకు ఫైర్‌, ఐఓసీఎల్‌, పోలీసు అధికారులు కలసి మరో మూడు గ్యాస్‌ ట్యాంకర్లు తెప్పించి అందులోకి గ్యాస్‌ మార్పించారు. బుధవారం క్రేన్ల సహాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన ట్యాంకర్‌ను రోడ్డుపై నిలుపగలిగారు. మధ్యాహ్నం సమయానికి వాహనాలను యథావిధిగా గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డు గుండా అనుమతించి ట్రాఫిక్‌ సరి చేశారు.

నాణ్యమైన ఆహారం అందించాలి

కడప ఎడ్యుకేషన్‌ : పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో వంట సిబ్బంది పాత్ర కీలకం అని ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్‌ ఎన్‌. కృష్ణప్రియ అన్నారు. ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద వంట మనుషులు, సహాయకులు మరియు కిచెన్‌ మేనేజర్లకు ‘‘స్మార్ట్‌ కిచెన్‌ మేనేజ్‌మెంట్‌’’పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, వంటగది పరిశుభ్రత, వంటకు ముందు ముడి పదార్థాల శుభ్రపరిచే విధానాలు మరియు పోషక విలువలు కోల్పోకుండా కూరగాయలను కట్‌ చేసే శాసీ్త్రయ పద్ధతులపై అవగాహన కల్పించారు. వంటగదుల్లో సరైన నిల్వ విధానాలు, పురుగుల నివారణ చర్యలపై కేవీకే అధినేత డా. వి.శిల్పకళ సాంకేతిక అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ ముగించున్న వంటమనుషులు, సహాయకులతోపాటు కిచెన్‌ మేనేజర్లకు సర్టిఫికెట్లు అందజేశారు.

బోల్తాపడిన ట్యాంకర్‌ నుంచి క్షేమంగా గ్యాస్‌ బదిలీ

ఎట్టకేలకు క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను నిలిపిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement