రాయచోటి: రాయచోటిలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం మామిడి పంటకు మరింత నష్టాన్ని చేకూర్చింది. ఇప్పటికే ఓ వైపు ధరల్లేక.... మరోవైపు దళారుల దోపిడీతో తల్లడిల్లుతు న్న రైతులకు మంగళవారం రాత్రి కురిసిన భారీ గాలులతో కూడిన వర్షం నట్టేటా ముంచింది. వర్షం కారణంగా నేలరాలిన మామిడిచెట్లు కాయలతో పాటు రానున్న రోజుల్లో మామిడికి ఊజి పురుగు సోకి తినడానికి కూడా పనికిరాకుండా పోతాయన్న భయం పట్టుకుంది. చాలా ప్రాంతాలలో చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విధంగా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీలోని చంద్రయ్య ఇంటి సమీపంలో టెంకాయ చెట్టుపై పిడుగు పడింది.
మామిడికి మరింత నష్టం


