గుర్రంకొండ: పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయా అధికారి శివనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని నడిమిఖండ్రిగలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో యాజమాన్య పద్ధతుల పాటించడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో వర్షాభావ ప్రాంతాల రైతులను దృష్టిలో ఉంచుకొని పీఎమ్‌డీఎస్ మోడల్ కింద 15కిలోల బరువుతో 25 నుంచి 30 రకాల విత్తనాలున్న ప్రత్యేక కిట్లను రైతులకు అందిస్తున్నామన్నారు.
● జిల్లాలోని రైతులు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కచ్చితంగా కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ సంఖ్య ఆధారంగానే రైతుభరోసా ఉంటుందన్నారు. ఈ సంఖ్యను పొందని రైతులు నిర్ణీత గడువులోగా సమీప రైతు సేవాకేంద్రాలకు వెళ్లి ఆన్‌లైన్‌లో విశిష్ట సంఖ్య కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎవో రత్నమ్మ, వీఏఏ వెంకట్, ఎఈవో రాజేష్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి
శివనారాయణ


