మదనపల్లె సిటీ: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026 ముందస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు, బూత్ లెవల్ అధికారులు నియామకం, శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ, పంపిణీ, బీఎల్‌ఓల కిట్ల అందజేత, బీఎల్‌ఓల గౌరవ వేతనాల చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, నియోజకవర్గ ఈఆర్వో లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ నిశాంత్‌కుమార్


