భయపెడుతున్న ధరలు | - | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న ధరలు

May 27 2026 6:26 AM | Updated on May 27 2026 6:26 AM

వరుసగా పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరల వల్ల నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇది అదనపు భారమే. పెరిగిన ధరలు భయపెడుతున్నాయి. –స్వాతి,

కడప క్రాస్‌, కురబలకోట మండలం

కొనాలంటే ఆలోచించాలి

పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి వారు బతకలేరు. పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలతో నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయలు, ప్రయాణ ఖర్చులతో పాటు ప్రతిదీ రేట్లు పెరిగాయి. ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. –డి. కళావతి,

అంగళ్లు, కురబలకోట మండలం

పెరిగిన ధరలతో అదనపు భారం

ఓ వైపు మండుతున్న ఎండలు మరో వైపు పెరిగిన ధరలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. పెరిగిన ధరలతో అదనపు భారం పడుతోంది. ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ప్రజలను ఏమార్చడానికి పాలకులు మాత్రం పొదుపు నాటకాలు ఆడుతుండడం సిగ్గుచేటు.

–మొలక త్రివేణి, అంగళ్లు

Advertisement
 
Advertisement
Advertisement