పది రోజులు..నాలుగు మార్లు..! | - | Sakshi
Sakshi News home page

పది రోజులు..నాలుగు మార్లు..!

May 26 2026 2:56 AM | Updated on May 26 2026 2:56 AM

ఇంధన ధరలను తగ్గించాలి

వరుసగా పెరుగుతున్న

పెట్రోల్‌ డీజల్‌ ధరలు

తాజాగా పెట్రోలుపై రూ. 2.84,

డీజల్‌పై రూ2.86 చొప్పున పెంపు

వరుస పెంపుదలపై

వాహనదారుల ఆగ్రహం

సాక్షి అన్నమయ్య : కూటమి సర్కార్‌ హయాంలో పెట్రోలు, డీజల్‌ మంట భయపెడుతోంది. ఎప్పుడూ లేని తరహాలో కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగుమార్లు ధరలు పెంచడం వాహనదారుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక రూపాయి కాదు...రెండు రూపాయలు అంతకన్నా కాదు..పెట్రోలు, డీజల్‌పై ఏకంగా రూ.8 వరకు పెంచుకుంటూ పోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెంచిన ఇంధన ఛార్జీలు తగ్గింపు కోరుతూ కూటమి పార్టీలు మినహా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సంకల్పించాయి.

ఇంధన ధరలు ౖపైపెకి...

జిల్లాలో వాహనదారులపై ఇంధన ధరల పెంపు పెను ప్రభావం చూపనున్నాయి. జిల్లాలో కంటైనర్లు, లారీలు, బస్సులు, జీపులు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దాదాపు ఆరు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రతినిత్యం వాహనాలు బయటికి కదలాలంటే పెట్రోలు, డీజల్‌ అవసరం. తాజాగా ధరల పెంపు కారణంగా పెట్రోలు రూ. 116.66, డీజల్‌ రూ. 104.38కు చేరుకుంది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండగా, మరోవైపు వాహనాల వినియోగానికి సంబంధించిన ఇంధన ధరలు ౖపైపెకి చేరుకుంటున్నాయి. కూటమి సర్కార్‌ అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే ఇంత భారీగా పెంచుకుంటూ పోవడం వాహనదారులను కుదిపేస్తోంది.

పెనుభారం

జిల్లాలో 120కి పైగా ఇంధనం సరఫరా చేసే బంకులు ఉన్నాయి. ప్రతినిత్యం డీజల్‌ 1.90 లక్షల లీటర్లు, పెట్రోలు 2.10 లక్షల లీటర్లు అమ్మడవుతోంది. ఇంధన కొనుగోలుపై వాహనదారులకు పెద్ద ఎత్తున వాత పడుతోంది. ప్రతినిత్యం డీజల్‌, పెట్రోలు కొనుగోలుపై రూ. 12 లక్షలకు అదనపు భారం పడుతోంది. ఈ లెక్కల నెలకు రూ. 3.69 కోట్లకు పైగా వాహనదారులు భరించాల్సి వస్తోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు ౖపైపెకే పోతుండడంతో ఆందోళన కలిగించే పరిణామం. కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు వివిధ పద్దుల్లో సుమారు రూ. 8 వరకు పెంచుకుంటూ పోయారు. లీటరుపై సరాసరిన రూ.8 అంటే....ఒక వ్యక్తి వాహనానికి 10 లీటర్ల పెట్రోలు పట్టిస్తే అదనంగా రూ.80 భరించాల్సి వస్తోంది.

రాష్ట్రంలో పెట్రోలు, డీజల్‌ ధరల పెంపు నిర్ణయం సరికాదు. పది రోజుల వ్యవధిలో నాలుగుమార్లు ధరలు పెంచుతూ వచ్చారు. అందులోనూ లీటరుపై ఒక్కోసారి ఒక్కోరకంగా పెంచడంతో వాహన దారులపై పెను ప్రభావం చూపుతోంది. కూటమి సర్కార్‌లోని పెద్ద లు మాత్రం ఇంధన పొదుపు అంటూ సామాన్యులపై భారం మోపడం ఎంతవరకు స మంజసం. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే ప్రజా ఉద్యమాలు తప్పవు. ఇప్పటికై నా పెంచిన ధరలు తగ్గించాలి.

– జంగంరెడ్డి కిశోర్‌దాస్‌, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం, అన్నమయ్య జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement