తొలిరోజు పరీక్ష ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు పరీక్ష ప్రశాంతం

May 26 2026 2:56 AM | Updated on May 26 2026 2:56 AM

మదనపల్లె సిటీ: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 1533 మంది విద్యార్థులకు 1233 మంది హాజరయ్యారు. మదనపల్లె పట్టణంలోని వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, నెహ్రు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, ఉర్దూ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం పరిశీలించారు. తొలిరోజు పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఓఈ తెలిపారు.

గజ వాహనంపై మల్లమ్మ

సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు, అర్చనలు, మహా మంగళహారతి నిర్వహించారు. రాత్రి మల్లమ్మ ఉత్సవ విగ్రహాన్ని గజ వాహనంపై కొండ రోడ్లపై ఊరేగించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో తరలివచ్చి పూజలు నిర్వహించారు.

దరఖాస్తుల ఆహ్వానం

కడప సెవెన్‌రోడ్స్‌ : పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్‌ సీఈఓ ఐజే విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవా రంగంలో అర్హులైన వారు హెచ్‌టీటీపీఎస్‌://అవార్‌ుడ్స.జీఓవీ.ఇన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హార్డ్‌, సాఫ్ట్‌ కాపీలను ఈనెల 31వ తేదీలోపు పోస్టుద్వారాగానీ, లేదా స్టెప్‌ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. వివరాలకు 98494 97011 నెంబరులో సంప్రదించాలని కోరారు.

జూన్‌ 5న పది ఇంగ్లీషు పరీక్ష

మదనపల్లె సిటీ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈనెల 28వతేదీ జరగాల్సిన ఇంగ్లీషు పరీక్ష జూన్‌ 5న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం తెలిపారు. ఈనెల 28వతేదీ బక్రీద్‌ను పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన ట్లు తెలిపారు. దీంతో ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీ షు పరీక్ష తేదీ మార్పు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement