డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్టానుసారం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేస్తుండడంతోనే ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. తద్వారా నిత్యావసర వస్తువులు ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెంచిన ధరలు తగ్గించాలి.
– భానుప్రకాష్‌రెడ్డి, ఎర్రగుంట్లపల్లె
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. రోజు రోజుకు ధరలు పెంచుతుండడంతో పలువురు డ్రైవర్లు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశంలో డీజిల్, పెట్రోల్‌పై పన్ను భారం మోపడం తీవ్ర అన్యాయం.
– చక్రధర్, పీలేరు


