వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రీడా మైదానంలో గత 15రోజులుగా సీపీఎల్–2 క్రికెట్ మ్యాచ్‌లు సాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆదిత్య బీఆర్, ఎన్‌కే స్పోర్ట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిత్య బీఆర్ జట్టు 183 పరుగులు చేయగా.. ఎన్‌కే స్పోర్ట్స్ జట్టు 184 పరుగులు చేసి విజయం సాధించింది. ఇందులో హేమాద్రి నాయుడు 25 పరుగులు చేసి 3 వికెట్లు సాధించి మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ అవార్డును సీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్ అందించారు. మధ్యాహ్నం నితిన్ వారియర్స్, హైపెరియన్ జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైపెరియన్ జట్టు 153 పరుగులు చేయగా.. నితిన్ వారియర్స్ జట్టు 140 పరుగులకు ఆలౌటైంది. హైపెరియన్ ప్లేయర్ సూర్యచరణ్ 3 వికెట్లు తీయడంతో మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ ట్రోఫీని తిరుపతికి చెందిన మారుతి హాస్పిటల్ అధినేత డాక్టర్ మారుతి కృష్ణ అందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ సునీల్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.


