రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

May 26 2026 2:56 AM | Updated on May 26 2026 2:56 AM

సదుం : సదుం మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..సోమల మండలం గురికానివారిపల్లెకి చెందిన రాజశేఖర్‌ (31) సదుం మండలంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని బైక్‌లో ఇంటికి బయలు దేరాడు. నడిగడ్డ సమీపంలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వ్యక్తి..

రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని మృతి చెందినట్లు ఎస్‌ఐ మధుసూధన్‌ సోమవారం తెలిపారు. గురువారం రాత్రి చైన్నై–అనంతపురం జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్‌ రోడ్డులో గుర్తు తెలియని వాహనంపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి కింద పడి త్రీవంగా గాయ పడ్డారు. అతన్ని చికిత్స కోసం అన్నమ్మయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని తెలిపారు. తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement